పుట:Palle-Padaalu-1928.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెఱకు తోట కోపు

—— ఇవి చిత్తూరు సీమవి. చెఱకు రైతుల పాట్లు చక్కగా చూపిస్తవి.

ఏలేస్తివి నరసన్న చెఱకు తోట
ఎందుకేస్తివి నరసన్న చెఱకుతోట
చుట్టు ముట్టు తోటల్ని చెఱకుతోట
చుట్టుకాని కొచ్చినాయి చెఱకుతోట
నరసన్న తోటలోన చెఱకుతోట
నక్క కోరక పచ్చి లేదు చెఱకుతోట
ఆయగాళ్ల కింతపోయె చెఱకుతోట
సాయగాళ్ల కింతపోయె చెఱకుతోట
అప్పులోళ్ల కింతపోయె చెణుకుతోట
అడిగినోళ్ల కింతపోయె చెఱకుతోట

'కిటతక కిటతక ' అని చతురశ్రగతిలోనే నడుస్తవి ఇవి.

65