పుట:Palle-Padaalu-1928.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తేరుకోపు

ఇది రత్నాల సీమ కోలాటపు పాట. తెలంగాణపు పాటలలోనూ రాయలసీమ పాటలలోనూ తెలుగు జిగి ఎక్కువేమో ? పరిశీలించండి అన్నలు.

వచ్చేనురా రంగ వచ్చేనురా
పెన్నోబుళము తేరు వచ్చేనురా
గుడ్ల కోడి జంపుకో గుజ్జంగ వండుకొని
గుత్తి లోన తెల్లవార వచ్చేనురా
కారుకోడె జంపుకోని కమ్మంగ వండుకోని
కదిరిలోన 'తెల్లవార వచ్చేనురా
అత్తమామ గొలిచేటిగుత్త నరసింహునకు
వత్తి లేని దీపం పెట్టి వచ్చేనురా
నట్టింట నుండేటి నాచిన్న బాలునకు
నఱ్ఱావుపాలు బోసి వచ్చేనురా
పాలుబోసి పండ బెట్టి వచ్చేనురా
నీళ్లుబోసి నిద్ద రూపి వచ్చేనురా

64