పుట:Palle-Padaalu-1928.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జారిణి కోపు

——ఇది వినండి తెలంగాణ కోలాటపు పాట.

గట్టూకు బోయి నేను - కట్టెలు తెమ్మంటె
కొప్పునున్నాపూలు - ఎక్కడివె భామా? నీ
కొప్పునున్నాపూలు - ఎక్కడివె భామా?
ఆత్తేరిపూలు - ఎక్కడివే భామా
ధూత్తేరిపూలు - ఎక్కడివె భామా

గాలి ధూళీ వచ్చి - గంపంత మబ్బొచ్చి
కొమ్మ ఊగి కొప్పు - నిండింది మగడా
కొమ్మ ఊగి కొప్పు - నిండింది మగడా
నాతోడు రంకాడ లేదు - ఆబ్బతోడు రంకాడలేదు
నీతోడు రంకాడ లేదు - అమ్మతోడు రంకాడ లేడు

అన్నీ సరేకాని - ఇన్నీ సరేగాని
కొంగు నిండా దుమ్ము - ఎక్కడిదె భామా
కొంగు నిండా దుమ్ము - ఎక్కడిదె భామా
ఆత్తేరి దుమ్ము - ఎక్కడిదే భామా
ధూత్తేరి డుమ్ము - ఎక్కడిదే భామా

పాటేలు ఇంటికి - పాలకని పోతేను
కఱ్ఱి కోడె కాలు - దువ్వింది మగడా

61