పుట:Palle-Padaalu-1928.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పు:-నన్న బియ్యము తెచ్చి ! చావట్లో ఉంచాను,
వంటైన వండగలవా ? ఓలె చెంచూ !
       వండైన చూపగలవా ? ౹౹స౹౹
స్త్రీ:-వెదురు బియ్యము తిను ! మాచెంచు వారికి
సన్నా బియ్యము లేలరా ! మగవాడ !
       సన్నబియ్యము లెంచుకు ౹౹వె౹౹
పు:-సన్న చీరెలు తెచ్చి | దణ్ణాన వేసాను
కట్టైన కట్టగలవా ! ఓల చెంచూ
       కట్టైన చూపగలవా? ౹౹స౹౹
స్త్రీ:-పారుటాకులుగట్టు | మాచెంచు వారికి
సన్న చీరెలు యేలర | మగవాడో
       సన్న చీరెలేలరా ౹౹పా౹౹

వెర్రి నరసింహస్వామి. తెలుగునాటి చెంచు బిడ్డను వలచ యెంతో యాశ పడినాడు! అందుకే పాడుకోగలిగినారు "అందమైన ఆడపడుచులు చెంచు వారి అందుకు ? పొంచి పొంచి ఓ బలేశు డెత్తక పొయ్యేటందుకు" అని చెంచువారు.

60