పుట:Palle-Padaalu-1928.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిసురురాతిపదము-3

సకియయిల్లుజోచ్చి యెల్ల జాలడె
సక్కన్ని వాడమ్మ సారంగధరుడు
ఇరుగుపొరుగమ్మలార ఇతని పోమ్మనగ
ఇరుగోరిమాటలు విననిచ్చి రేను
పొరుగోరిమాటలు పానవచ్చి రేను
చిలుక నీళ్లుతోడె జలకమాడేను
హంసఅన్నములొండె ఆరగించేను
వెలదీమంచము లేయె వెన్నెలబైట
పడతిపానుపులెయ్యె పవ్వళించేను
ఆకుతేవె పోకతేవె అడకత్తి తేవె
చూడసున్నఫుకాయ చుట్టియ్యెమడుపు
సన్నంగచుట్టియె సగముకొరికియె
యెంగి లెంగిలిశివుడ యెగ్గుపట్టేవు
మనకేమియెంగిలీ పుణ్య పురుషులకు
విసినెకర్రలుతోను విసిరె ఒక జాము
ఇసిరిసిరి ఆకాంత స్తంభానికొరిగె
కాంతకీకన్నీళ్లు కాల్వలై పారె
వానకురవ లేదీ వరదయెక్కడిది
అమ్మరో మనయింట్లో వొరువ లెక్కడివె
నువుపోయి పరసింట్లో పండుంటివి కొడక
ఆడవారిశోకంబు అటువంటిదప్ప

దీని వరసలు ద్విపద వరసల్లాగ కనబడతవి. కాని వీటిలో ద్విపదల గణనియవాము కనబడదు. ఇవి నాలుగేసి కిటతకిట, ఆవ్రుతాల పాదాలపాటలు. పాడేవారు పొదానికి ఇరవై మాత్రలు పదోరీతిని కిట్టించేస్తారు.

42