పుట:Palle-Padaalu-1928.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విసురురాతిపదము - 3


నలకొండల నడుమ వుతికె సాకాలి
మాయన్న ఏసిన పేరేమె?
చింతకుంటనూలమ్మ శిరువేళ్లతొగరు
నంద్యాల నల్లంచు లంజె పేటంచు
కందనోలు కరకంచు కంది బేడంచు
ఉతకరా చాకాలి వుల్లి పువ్వాలె
మడసారా సాకాలి మల్లె మొగ్గాలె
ఇచ్చిరా సాకాలి అన్న వాడలకి
ఇచ్చేను వొచ్చేను ఇల్లునే నెరుగ
గచ్చూతొకట్టిన గాజు స్తంభాలు
సున్నమ్ము పూసిన నుకటి మిద్దిళ్లు
వేపమాని యెదురిల్లు ఎద్దూల మిద్దె

41