పుట:Palle-Padaalu-1928.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విసురురాతిపదము-2

తూరుపు వాకిళ్లకు దూలాలుగావు
పరమటి విండ్లకు పలకల్లుగావు
మాయింటి కోడండ్లకు రోకళ్లుగావు
ధనము రాసులిచ్చె తండ్రి రామయ్య
నీవైన చెప్పరాద ఆమాని పేరు
అమ్మరో నీకింత వినవేడుకైతె
మాడల్లో పొయ్యేటి మరుదుళ్లనడుగు
మాడల్లో పొయ్యేటి మరిది సుబ్బయ్య
నీవైన చెప్పరాద ఆమాని పేరు
అమ్మరో నీకింత విన వేడుకైతే
మైసాక్షి పక్షుల్ల మానుల్ల నడుగు
ఆమ్మారో నీకింత వినవేడుకైతె
బారాసొవిటి మీది బావల్ల నడుగు
అమ్మారో నీకింత వినవేడుకైతె
కొలువు సావిడి మీది కొడుకుల్ల నడుగు
అమ్మారో నీకింత వినవేడుకైతె
నేలాన పండిన పల్లేరు చెట్టు

40