పుట:Palle-Padaalu-1928.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఓచిన్నదాన

"జంబైలే జోరులంగరు" అన్నదితుమ్మెదా, వెన్నేలా, గునాసారి గున్నమ్మా వంటి పాదాంత పదావళే (పల్లవికాదు), ఈ పాదాంత పదావళితో ఎన్ని పాటలైనా వినబడుతాయి. జంబైలే జోరులంగరు "కొండామిదా కోడిపెట్ట" అన్న ఇంకొక పాట పూర్తిగా దొరికినది కాదు. కూలివారందరూ "జంబైలే జోరులంగరు" అని కలిసిపాడుతారు. కల్పనా కారుడొకడు మాటలు అల్లుతాడు. ఈ అల్లిలసోగసును బట్టి వారప్పుడప్పుడు గొల్లుమంటుంటారు కూడా.

——రోడ్డురోలరు లాగుకుంటూపోయే కూలీలపాట చూడండి. లిఒడో ఇంకొక అడుగు వేస్తుంది.

       ఓచిన్నదానా విడువ నెచెంగు
       ఓచిన్నదానా వదలనెకొంగు
బందారు చిన్నదాన బాజాబందూలదాన
బాజా బందూలమీద మోజేలలేదే ౹౹ ఓ చిన్నదాన ౹౹
గుంటూరు చిన్నదాన గుళ్ళా పేరులదాన
గుళ్ళా పేరులమీద కళ్ళూపోలేదే ౹౹ చిన్నదాన ౹౹
కాకినాడ చిన్నదాన కాసూల్ కంటేలదాన
కాసూల్ కంటేల మీద మనసేలలేదే ౹౹ ఓచిన్నదాన ౹౹
అర్ధారూపాయి పెట్టి అద్దాల రయికకొంటె
అద్దాలరయిక మీద బుద్దేలలేదే ౹౹ ఓచిన్నదాన ౹౹
నల్లానల్లానిదాన నడుమూ సన్నానిదాన
తళుకూ సేపలమల్లె కులుకూసూపులదాన ౹౹ ఓ చిన్నదాన ౹౹
నిన్ను సూసీ మనసు నులువకున్నదోలె ౹౹ ఓ చిన్న దాన ౹౹

ఈ పాటలోని దీర్ఘాలూ, యతి ప్రాసలూన్నూ బృందగానమున్నూ దారినిపోయే బాటసారులు నెందరినో పట్టి అలరించవలవు. ఆలగించును గూడ. పాడుకుంటూ రోటరులాగే జట్లు నేటికి సుందర సామగ్రియే. కనుక నే కవికొండల వేంకటరావుగారు కూలీ యన్నల (ఈ) కుతుకమును ఒక ఖండకావ్యములో ఇమిడ్చినారు.

34