పుట:Palle-Padaalu-1928.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పొలిగాడు

——పోలి గాడు పంటలను సిద్దింపజేసే దేవుడు. ఎక్కడైనా కుప్పమార్పులు పోన్నలన్నీ గాటి పోలిగాడు అక్కడ తయారు !

ఒలియా ఒలియా ఒలియా
రావేలు గలవాడ రారపొలిగాడ
తూర్పునా ఒకవాన తుమ్మెదల మోత
పడమట ఒకవాన పట్టికురవంగ
ఈ వాన ఆ వాన ఏక జడివాన
ఏదిలీ చేసుకూ ఎడ వాన లాయె
వెండి తూముల కింద వెల్లడము పండు
పైడి తూముల కింద పాలంకి పండు
రావేలు పోవేలు రాసి పదివేలు
రావేలు మీదయ్య రాసి మాదయ్య
పొలో పొలి పొలి పొలి
తిరుప తెంకన్నిచ్చిన పొలి
విను కొండెం కమ్మిచ్చిన పోలి
పొలేలుగా చాల పొలి

16