పుట:Palle-Padaalu-1928.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాకు గరగెత్తితే యెన్నెలా, నా నాగనం యిస్తాను యెన్నెలా
నీ నాగరం నాకొద్దు యెన్నెలా, నీగరగ నేనెత్త యెన్నెలా
అయిఅయితే నీమనను యెన్నెలా, నేనే వస్తాను యెన్నెలా

గరగ యెత్తినమాత్రానికే ఈ జాణ తానే వెంటవస్తుందట ! కామన్న ఏమి తక్కువవాడా? ఆవూ, ఎద్దూ, నాగరమూ ఏదీ వద్దట! ఆయన గారుకూడా ఆఖరి మాటకొఱకనే ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తాడు. ఈ సరసాలు సహజంగా ఈ రూపాన్న జరిగేవికావనీ ఇవి కల్పనలే అనీ ఈ పాటలో చక్కగా తెలుస్తుంది

17