పుట:Palle-Padaalu-1928.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చందమామ

చందమామ చందమామ చందమామ ఈ
సంధి తెలిపే జ్ఞానులెవరె చందమామ
జంట నాగస్వరములూది చందమామ
పాముని పాదు పెకలించాలి చందమామ
తొమ్మిది వాకిళ్లుమూసి చందమామ
పామునిపట్టవలెను చందమామ
కాయమనే ఫుట్టలోను చందమామ
మాయగానె మెలగియుండు చందమామ
భక్తియనే కట్టుకట్టి చందమామ
యుక్తిచేత పట్టవలెను చందమామ
దేహిదేహముల నందు చందమామ
తెలియకుండ చుట్టుకుంది చందమామ
ఆ జపమంత ధ్యానముచేత చందమామ
అఖండ కళలతో వెలుగుచుండు చందమామ
పాముపట్టేజోగి యెవరె చందమామ
అతని పేరు సిద్ధగురుడె చందమామ