పుట:Palle-Padaalu-1928.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీలాటి రేవు

——ఎంత సేపూ పొలము ఘోషయేనా? ఈ వెన్నెల పదము వినండి. ఇది కోత సమ యంలో పాడుకున్నా; ఆరు బయట వెన్నెలలో పక్కలు శేషక పండుకుని పాడుకున్నా; పండిన జొన్న కంకులు పళ్ళెములలో పేర్చి ఇంటింటికీ తిరుగుతూ వినోదార్ధము పాడినా అందగిస్తుంది. ఆరీతిగా పాడతారు కూడాను.

ఆగరగపట్టింది యెన్నెలా, నీళ్ళాకు వచ్చింది యెన్నెలా
పాపేడిసెట్టెక్కి యెన్నెలా, పలుకర్రయినయిరిసి యెన్నెలా
పగడాలరాయెక్కి యెన్నెలా, పలువరసలతోమింది యెన్నెలా
ముత్యాలరాయెక్కి యెన్నెలా, మునిపల్లయినతోమె యెన్నెలా
నలుపైనరాయెక్కి యెన్నెలా, నాలుకైనగీసొ యెన్నెలా
ముడికీడునీళ్లలో యెన్నెలా, మొకమైనకడిగింది యెన్నెలా
చేరెడునీళ్లల్లో యెన్నెలా, చెయిజెబ్బాలుకడిగొ యెన్నెలా
సుట్టుజల్త రిసాపు యెన్నేలా, నుమ్మల్లుసుట్టిందో యెన్నెలా
ఆగరగముంచింది యెన్నెలా, ఒడ్డునా బెట్టింది యెన్నెలా
అట్టుఇటుసూసింది యెన్నెలా, ఎవ్వారు లేరయ్వె యెన్నెలా
గట్టుమీది కామన్న యెన్నెలా, గరగెత్తి పోరయ్య యెన్నెలా
నీకు గరగెత్తితే యెన్నెలా, నాకేమియిస్తావు యెన్నెలా
నాకు గరగెత్తితే యెన్నెలా, నా పొడవునిస్తాను యెన్నెలా
నీ పొడావునాకొద్దు యెన్నెలా, నీగరగ నేనెత్త యెన్నెలా
నాకు గరగెత్తితే యెన్నేలా, నా గున్నేద్దునిస్తాను యెన్నెలా
నీ గున్నెద్దునాకొద్దు యెన్నెలా, నీగరగ నేనెత్త యెన్నెలా

16