పుట:Palle-Padaalu-1928.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గురుపాద పద్మాలు తుమ్మెదా, నిన్ను
దరిశించు మంటిని తుమ్మెదా ౹౹శివశివ౹౹
గురుడు నీశిరమూన తుమ్మెదా, మా
గురుడు నీశిరసూన తుమ్మెదా
కర పద్మములు మోపి తుమ్మెదా
ఆరయ నేగంటీశుడుండు తుమ్మెదా ౹౹శివశివ౹౹

ఈ పాటలో 'శివశివ...' అన్నది పల్లవి అనవచ్చును. ఈపాట అన్నమయ్య సంకీర్తనలు, జయ దేవుని అష్టపదులు వలెనే చరణము పల్లవి చరణము పల్లవి, లతో సాగిపోయినది. ఆనాటికి అనుపల్లవి ఏర్పడలేదు.