పుట:Palle-Padaalu-1928.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యవ్వాసమం దావె తుమ్మెదా, బహు
పువ్వూల వాసానె తుమ్మెదా
క్రోవ్వి నీ వెఱుగావే తుమ్మెదా, నీకు
నెవ్వి నేరము లేదు తుమ్మెదా ౹౹శివశివ౹౹
ఆఱు రేకుల పువ్వుతుమ్మెదా - అది
మీఱిన వాసానె తుమ్మెదా
వేఱుసేయక నీవు తుమ్మెదా, శివు
జేఱి భజియించవే తుమ్మెదా ౹౹శివశివ౹౹
యీళ పింగళలు తుమ్మెదా, సుషుమ్న
నాళి మధ్యమున తుమ్మెదా
మేలిమేఱిగే నీవు తుమ్మెదా, శివ
కేళిజరించావె తుమ్మెదా ౹౹శివశివ౹౹
ఏడుగురు రాజులు తుమ్మెదా, నీకు
జూడ బండ్లుజోడు తుమ్మెదా, వట్టి
యాశగోసి వేసి తుమ్మెదా
మోసపోకుమంటి తుమ్మెదా భక్తి
రాశి కెక్కుమంటి తుమ్మెదా ౹౹శివశివ౹౹
అష్టదళము మీద తుమ్మెదా నీవు
మెట్టి చరించావె తుమ్మెదా
కష్టాము నెఱుగావె తుమ్మెదా, నీవు
స్రష్టవైయుండావె తుమ్మెదా ౹౹శివశివ౹౹