పుట:Palle-Padaalu-1928.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పేట్రాయిసామిదేవుడా

——పెట్రాయి, బెట్రాయి, ప్రేట్రాయి అనిపాఠభేదాలున్నవి. ఇది అవతార కీర్తన. ఆవతారాలను గురించిన సుదీర్ఘ రచన లున్నవని శ్రీ తూమాటి దోణప్ప గారు చెప్పిరి. ఈ పాటలో అచ్చయిన కొన్ని పాఠములలో వలె నాగరికుల సమాసకల్పనము లేదు.

పేట్రాయి సామి దేవుడా మమ్మేలినోడ
పేట్రాయి సామి దేవుడా
కాటమీరాయడా కదిరి నకసిమ్ముడా
నీటైన యాలకాడ నిన్నెగోరి నమ్మినాడ ౹౹పేట్రాయి౹౹
చేపకడుపున చేరిపుడితివి-రాకాసిగాని
కోపమూని కోరికోడితివి
ఆ పెన్నీటిలోన ఒలసి గ్రక్కున దూరి
బాపనోళ్ల సదువులెల్ల బెమ్మ దేవుడికిచ్చినోడ ౹౹
తాబేలై తాను పుట్టగా అనీళ్ల కాడ
దేవాసు రెల్ల గూడగా
తావుసూసి కొండ కింద దూరగానె సిల్కినపుడు
చావు లేని వెన్నమందు దేవర్ల కిచ్చినోడ ౹౹
అందగాడవవుదు లేవయా - గోపాలగో
విందరచ్చింపరావయా
పందిలోన సెరుకోని పంట భూమి నెతి కింద
సిందర సిందర సేసినట్టి సందమామనీ వెకావ ౹౹