పుట:Palle-Padaalu-1928.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బొల్లారపిల్ల

——చెడిన పిల్లను ఉంపుడుకత్తెనుగా చేసుకున్నాడు వీడు. కులము చెడిన బోల్లార పిల్ల ఏమిచేయగలదు ? అన్నలే చెయ్య లేకపోయిరి.

పెట్టిపోస్తావుంట పైనిండ బట్టలు పెడ్త
నా పేరుమీద బతుకవే ఓ బొల్లారపిల్లా !
ఆచ్చాము తెల్లచీర అంచూన జిల్లెడు గొమ్మ
నీ కొంగున రామచిలుకలే ఓబొల్లారపిల్లా !
బాయిల యిల్లు గట్టి బొజ్జోడు యెంట వడితె
కుంటోడు కులము జెరిపెనే ఓబోల్లారపిల్లా !
నీ కాలుకు నామట్టె నాసేతులున్నకట్టె
నిను కొట్టకుంటే -ఒట్టెనే ఓబోల్లారపిల్లా !
సంకల సపై తట్టా సేతుల సీపురుకట్టా
నీయెంట జెమా నెందుకే ఓబొల్లారపిల్లా!
బండమీద బలిజోల్లు బాగోతులాడంగా
బాగతన్నుల్ తింటివే ఓ బొల్లారపిల్లా !
దొరగారి జీతగాడు దోరెడ్ల మేపెటోడు
దొడ్డెక్కి సీటిగొట్టెనే ఓ బొల్లారపిల్లా !
పటేండ్ల జీతగాడు పై ఎడ్ల మేపెటోడు
బండమీద సీటిగొట్టెనే ఓ బొల్లారపిల్లా !
దిగింది డిచ్చు వెళ్ళి పోయింది సుద్ద వెళ్ళి