పుట:Palle-Padaalu-1928.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సేద్యానికి పోకుండ యేగనూకనా ?
సేద్యానికి పోకుండ యెగసూకితే
భావిలోవున్న గుంటలోన నేనుపడనా
భావిలోవున్న గుంటలోన నీవుపడితే
వెట్టోణ్ణి పిలిపించి యెత్తించనా?
వెట్టోణ్ణి పిలిపించి యెత్తించితే నే
దెయ్యమై భూతమై నిన్ను పట్టనా
దెయ్యమై భూతమై నన్ను పట్టితే నే
వైదుగుణ్ణి పిలిపించి వదలగొట్టనా
వైదుగుణ్ణి పిలిపించి వదలగొట్టితే "నే
తిరుపతికొండెక్కి తిరిగిచూడనా
తిరుపతికొండెక్కి తిరిగి చూసితే నే
బెంగపురీ కొండెక్కి బిందొక్కనా ?

ఈ రకపు పాటల తునకలు పెక్కులు. దీనియంత పెద్దది అచ్చులో వచ్చినట్లు లేదు. కావలి లో ఒక బిచ్చగాని వద్ద రాసుకున్నది,