పుట:Palle-Padaalu-1928.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బేరము

వస్తానుగాని మామ వస్తానుగానీ. . . నన్ను
కొట్టకుండ తిట్టకుండ పెట్టుకుంటావా?నిన్ను
కొట్టకుండ తిట్టకుండ పెట్టుకుంటాను నువ్వు
యెవరితోను మాట్లాడకుండ వుంటావు కదా?
యెవరితోను మాట్లాడకుండవుంటాను కానినే
నవ్వేటి నవ్వు మొఖం "యెట్ల పెట్టేది?
నవ్వేటి నవ్వు మొఖం ఆట్ల పెట్తేను నా
చేతిలోవుండె చారకోలు చెండాడదా?
చేతిలోవుండే చారకోలు చెండాడితే నా
నోట్లో వుండే బండమాట బయటెల్లదా?
నోట్లోవుండె బండమాట బయటెల్లి తే నా
కాళ్లవుండె కిర్రుజోడు దవడాడదా? నీ
కాళ్ల వుండె కిర్రుజొడు దవడాడితే నా
అమ్మగారింటికి నేనెళ్లనా నీ
అమ్మగారింటికీ నీ వెళ్లితే నే
కొట్టకుంట తిట్టకుండ తోడ్కొనిరానా ?
కొట్టకుండ తిట్టకుండ తొడ్కొనొస్తేనే
కూడునీళ్లు వండకుండ దిగనూకనా
కూడునీళ్లు వండకుండ దిగనూకితే నే