పుట:Palle-Padaalu-1928.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కులు

మొక్కిన మొక్కులు సల్లగుండీ
మొగుడి కళ్లుపోతే - నా
మొగుడి కళ్లుపోతే
కట్టమీది ఆ అంkaaళ్లమ్మku
పెట్టకోళ్ల నిస్తూ
దండుకుపోయిన యిద్దరు మరుదులు
గుండ్లు తగిలి సస్తే - పెద్ద
గుండ్లు తగిలి సస్తే
సాతులూరి యా పోతురాజుకు
మేకపోతునిస్తు
సంకనవున్నా చంటిబిడ్డకు
సన్నిగొట్టిపోతే-మాయ
సన్నిగొట్టిపోతే
సత్తైన పిల్లీ గోపాలుడికి
నిత్తె పూజ సేతు ౹౹

దీనికి వ్యాఖ్యానము దండుగ. ఉపపతికి సొమ్ము చాలదు. ఉనికి అత్తింటనే సౌఖ్యము. ఆనుకూల్యత కోఱకు మాత్రమే మొక్కుకుంటున్నది.