పుట:Palle-Padaalu-1928.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొయ్యోడ

——కొయ్యోడు పాటలు ఉత్తర విశాఖ మండలములో చాల ఉన్నవి. ఇది అసలుపాటుయో అను కరణమో తెలియరాదు. రచనా సంపూర్ణతను గుర్తిస్తే ఇది నాగరికుల రచన లాగే అగు పడుచున్నది.

చుక్కలకోకా కటుకోని
చుట్టూ గోడు రైకా లొడిగి
బుఱ్ఱ నున్నగ దువ్వూకోని
బొట్టూ కాటుక పెట్టుకోని
నోటికి చుట్టా పెట్టుకోని
గోటుగాను నడుచుకుంటూ
చక్కదనమే చూసుకుంటూ
ఎక్కడి కేల్తవు చిట్టెమ్మంటే
పోలేరమ్మ మెరకల మీదికి
పుల్లల కెల్తము కొయ్యొడో
రయ్యొ కొయ్యొడా ౹౹
కర్ర చేత పట్టుకోని
కిర్రూ చెప్పులు తొడుగూ కోని
పాయల మొల్తాడేసుకోని
కాయి పంచలు కట్టుకోని
వక్కలాకులు వేసూకోని
ఎక్కడి కెల్తవు కొయ్యోడంటే