పుట:Palle-Padaalu-1928.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మచ్చుజల్లి పోయెదరు
మాయలో పడబోకుమురా అప్పనా

నీకు నాకు తోడుగాన
నిమ్మపూల తెప్పమీద
తేలిపోవ మనసు పుట్టె
తెల్లవారు చెప్పుడురా అప్పనా

ఎప్పుడిల్లు విడిచెదనో
ఎపుడునిను చూచెదనో
చిత్తమూ చెదిరిపోయే
కత్తికోత లాగనుండి అప్పనా