పుట:Palle-Padaalu-1928.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బంగారుసామి

అద్దాల మహలులోని
          ఓరబ్బా, బంగరిసామీ!
ఇట్ల రాని పోని మాటలకి
వాదాడబోకురో!
          రబ్బే ! బంగరిసామి !
ఊటికాయల కాల మొచ్చెనురో ౹౹
          రబ్బే ! బంగరిసామా !
ఉబ్బింది – దాని మొగము
వుబ్బితే వుబ్బింది గాని
సబ్బుయేసి రుద్దరో !
          రబ్బే ! బంగరిసామి ౹౹
కలే కాయల కాల మొచ్చె
కఱ్ఱ పిల్లకు ప్రొయ మొచ్చె
నుట్ట గాల్పుకున్నట్టు దాని
నుట్టింటి కెడతావు; దాని
నుట్టూర దిరుగుతవో !
          రబ్బే ! బంగరిసామి ౹౹