పుట:Palle-Padaalu-1928.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెడ్డోళ్ల జీతగాడా

రెడ్డోళ్ల జీతగాడా మేటైన మొనగాడా
అబలగు బలతలుపు ఐదంకణాల యిల్లు
ఆ యిల్లు తిరిగిరారా నను ముద్దులాడిపోరా ౹౹
నడివీధిలోన యిల్లు బాజారులోన బావి
ఆ బావికాడరారా నాబానలందుకోరా ౹౹
సందులోన గుడి నడివీధిలోన సరస
నాగోటిమీద తేరు ఆ తేరు తిరిగిరారా
నాతేటలందుకోరా ౹౹రెడ్డోళ్ల ౹౹
నువు సుట్టమురీతిరారా నువుసుట్టకాలు తేరా
నను చూచియైన పోరా ౹౹
నా అబలగు బలతలుపు ఐదంకణాలమిద్దె
ఆ మిద్దె తిరిగిరారా ననుముద్దు లాడిపోరా ౹౹
జిల్లేడమ్మ జిట్టనా మనోరాజ మొగ్గ
నా మల్లెపూల జెండా నాముంత మామిడిపండా
నాయింపుమీదసొంపు నా సొంపుమీద యింపు ౹౹
నువువస్తానంటేచాలు నామగనికంటే మేలు
నిన్నెట్లు మరచిపోదు
ఇట్లవానిపొందు నేనెట్లు మరచియుందు ౹౹
నీ చేతిలోన ఉంగం నా చేతికీయరాదా