పుట:Palle-Padaalu-1928.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రత్తి చేను

సూరేపల్లి ముద్దుల బావను చూచే దేన్నటికో
ఊరిముందటి పత్తి చేను వేసేదెన్నటికో
ఆదివూసే దెన్నటికో మరి
కాసేదెన్నటికో

మొదట ముద్దుల బావను ఈ ముగ్ధ ఊరి ముందటి ప్రత్తి చేనిలో కలసినది; మరల గలియుటకు ఆ పరిస్థితులే రావలెనని ఎదురు చూచుచున్న ఈ వెఱ్ఱి "పండి తెల్ల బాఱు వరి తోటలను జూచి" మొగము వంచి యేడ్చు మహిందుని ముగ్ధకు చెల్లెలు కావలయును. మొదటి పాదము తీసివేస్తే శాలివాహన సప్తశతిలోనికి ఈపాట సులువుగ ప్రవేశించగలదు.