పుట:Palle-Padaalu-1928.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నే చిన్న దాన్ని రా

——ఇది యేవరో చిన్నతనము వడలకుండనే తొందరపడినది.చేయికాలిన పిదప పట్టుకొను చున్నది.

వడ్లతట్టెత్తుకోని - వలసలకు నేబోతె
వలసలో నాకొప్పు - గొలుసూడేరాజా
        బాలరోనే చిన్నదాన్ని రా !
        చెలియరోనే చిన్నదాన్ని రా!
ఈదులకుంటాకు - నీళ్లకు నేబోతె
ఈతముల్లూ - తగిలి ఈడేరెరాజా
        బాలరో నేచిన్నదాన్నిరా
        చెలియరోనే చిన్నదాన్ని రా
కడియాల కుంటాకు - నీళ్లకు నేబోతె
కవిలిముల్లూ తగిలి - కడుపాయెరాజా
       బాలరోనే చిన్నదాన్ని రా
       చెలియరోనే చిన్న దాన్ని రా
తుమ్మాలకుంటాకు - నీళ్లకు నేబోతె
తుమ్మముల్లూ తగిలి - తిమ్మణ్ణి నేగంటి
        బాలరో నేచిన్నదాన్నిరా