పుట:Palle-Padaalu-1928.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బండినిలిపి బెల్లాము భోంచేసినాడో ...నెరా
వర్సాము కురిసింది వానయినాకురిసింది
వర్సాము వానాలో తడిసీపోయేము ...నెరా
సిట్టడవి దాటేము పొట్టడవి దాటేము
అన్నడవిలు దాటేసి ఐక్యామైపోయేము ...నెరా

వారు పొందని ఆమభవాలు లేవు. గతుకులలో పడి వర్షములో తడిసి అడవులన్నీ దాటి "అనంత పథాలకు ప్రయాణ మైనారు".

ఎక్కు-నరమా బండెక్కు నరమా
ఎక్కిన బండి దిగొద్దు నరమా ౹౹

అన్న పాట దీని తరువాతిది.