పుట:Palle-Padaalu-1928.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిలుపు

——ఈపిల్లకు తనసంగతి అర్ధమైనది. విహారమునకు పోదము రమ్మంటున్నది అక్కను, ఏమధురాను భూతీయో కాలికి తగులక పోవునా ?

రాయెమ్మె రాజక్క
సాలోడు నేసిన
మెరపుటద్దాల రైకె
తొడిగన్న సూత్తము ౹౹రా౹౹
ఆవుసులోడు చేసిన
అందమైన కమ్మలు
పెట్టన్న సూత్తము ౹౹రా౹౹
కుమ్మరోడు వానిన
గట్టి ఎనలలు
వాడన్న సూత్తము ౹౹రా౹౹
పోశమ్మ సందులోన
పొంగుతున్నది లొట్టి
తాగన్న సూత్తము ౹౹రా౹౹
పటేలు దొడ్డిలోన
గడ్డాము వున్నాది
పోయన్న సూత్తము ౹౹రా౹౹