పుట:Palle-Padaalu-1928.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజడిగితేమందును?

——ఈపాట కాలుజారిన చిన్న దానికిని ఆమెను తప్పుదారి త్రోక్కించిన చిన్న వానికినీ జరుగు సంభాషణను వినిపించుచున్నది. నీడుగనేకారి. ఆమెకు ఉపాయములూ సాకులూ, చెప్పి పెట్టుచున్నాడు.

కాలిమట్టెలు పోయెను | చినవాడ ! రాజడిగి తేమందును ?
మన గడప పెద్దదనవే | చినదాన ! గడపతగిలి పోయెననవే.
చేతి గాజులు పోయెను ! చినవాడ ! రాజడిగి తేమందును ?
శెనగపువురోకలనవె ! చినదాన | చెయిజారి పోయెననవే ;
వల్లెల్ల రక్కులారె ? | చినవాడ : రాజరడిగితేమందు ?
మన యిల్లు చీకటిల్లు | చినదాన | మనపిల్లి రక్కులనవే |
నొష్ఠ కుంకుమ (బొట్టులు) పోయెను ! చినవాడరాజడిగి తేమందును?
చిరు చెమట లెక్కననుమా | చిన దాన | చెమటనుకరిగిననుమా!

ఈమె తలుపు దగ్గర పాటనోక్క దాని నైనను విన్నట్లు లేదు.