పుట:Palle-Padaalu-1928.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాడు; ముసిముసి నవ్వుతో
      మురిపించి పోయాడు; ...చందమామో!

ఆ; మగవాని కౌగింట
      మరణించినాచాలు; ...చందమామో!

వాడు; కంటికి కడబడితే,
      కదులునా అడుగేసి; ...చందమామో!

దీనికి జవాబనిపించుపాట చిన్న దానిభావాలు కూర్చింది. ఉన్నది. కాని ఆమె దేహ సౌందర్యమునూ, అంగ సౌష్టవమునూ నెమరువేయునది ఆపాట.

వలపుకత్తె ఇంకొకర్తె తన నరసయ్య మామతో చెప్పుకుంటున్నది.

దూరభారము దున్నబోకు
దిబ్బ లెక్కి చూడలేను
ఊరుముంగిట ఉలవసల్లబ్బి
ఓరందకాడ నరసయ్యమామ
ఉలవకోతకి పిలువనంపబ్బి.