పుట:Palle-Padaalu-1928.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చీమిడి ముక్కు, చింపిరితలకాయా
ఒల్లానంటి విగదర ఒల్లానంటి విగదర
                                      ఓ మేనమామా౹౹
ప్రాయా మొచ్చినపుడు - పైటొచ్చినపుడూ
ఓగిస్తెవచ్చీనె - ఓగి స్తెవచ్చీనే -
                                       ఓ మేనమామా ౹౹

అని చిన్నప్పుడు చూచి తన్నోల్లని మామను దెప్పిపొడుచు చున్నది వయసులోనున్న చిన్నది.అయితే యీమె స్వాధీనపతిక. ఇందాకటి పాటలోనిది విప్రోషితవలెనే కన్పించుచున్నది.