పుట:Palle-Padaalu-1928.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గంగి- గంగారాం

——గంగి ఏదో మిష పై గంగారాం కడకు చేరినది. తాను వదలి పోయిన వస్తువులట ఆడతున్నది, ఏవీ ఇవ్వను, నిన్ను పోనివ్వను అంటున్నాడు. ఆయి తేవట్టి మాటలకు మోసపోరె కాదుగంగి! గంగారాం

చిక్కుడు చెట్లల్లో గంగారాం
నా సిగ్గుబోయింది "
నా సిగ్గు నాకియ్యి "
నా వోల్లను కల్వబోత "
నీ సిగ్గు నీకయ్యనే గంగి
నీ వోల్లను కల్వబోనియ్యనే "
వంకాయ సెట్లల్లో గంగారాం
నా వంకె పోయింది "
నా వంకె నాకియ్యి "
నావోల్ల యింటికిపోత "
నీ వంకె నీకియ్యనే గంగి
నీవోల్ల యింటికి పోనియ్యనే "
బీర సెట్లల్లో గంగారాం
నా చీరె పోయింది "
నా చీరె నాకియ్యి "
నావోల్లను కొయ్యవోత "