పుట:Palle-Padaalu-1928.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వదిన

——ఇది వయసుకుదరని సరసము. పిల్లగాడు వదినతో సరసములాడుతున్నాడు.

ఒడ్డుమీద కూసున్న పిల్లగో
నువ్వేవ్వరి కొడుకవో పిల్లగా
       నేను మేనత్త కొడుకను వదినో
       నీకు నీటైన చీరెలు దెచ్చేను వదినో
చీరెలు బీరెలు అక్కడా
నామనసైన మాట ఇక్కడా
       నీదగ్గరికి వత్తిని వదినో
       నీకు రైకెల్ దెత్తిని వదినో
రైకల్ బీకెల్ అక్కడా
నామనసైన మాట యిక్కడా
       పొంగుకుంట వత్తిని వదినో
       నీకు పోగుల్ దెత్తిని వదినో
పోగుల్ గీగుల్ అక్కడా
నా మనసైనమాట ఇక్కడా

వదినకు ఇచ్చకాలు గిట్టవు, మనసైన మాట పలికితే వింటుంది. చీరెలు, రైకలు, పోగులు అల్లంత దూరములో నుండవలసినదే.

192