పుట:Palle-Padaalu-1928.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

పాపిష్టి గాలివాన బెజవాడకు రాకపోతే
       కష్టాలె లేకపోవును గదరా
కంటికి కాటు కెట్టి కడవ చంకాన బెట్టి
       కన్నీరు కడవనిండెను గదరా
నీరూపు చూడగోరి దారులుగాచగానె
       పాడైన శకున మాయెను గదరా
నీవు నేను ఏకమైతే నిండు చందురుడు నవ్వి
       మేఘాల దూరిపోయెను గదరా
నిన్ను జూచి నన్ను జూచి పున్నమచందురుడు
       నవ్విచిక్కిశల్యమయ్యెనుగదరా
విరజాజిపూలు పూసే ఉరవైన వనములోన
       గురువింద లేరుదాము పదరా
పసిడి పన్నీటిలోన మిసిమి కాంతులతోడ
       బంగారు చేపలున్న వికదరా
బలమైన అలలు రేగి చలియించు సాగరమున
       సంగీతమాలకింతముపదరా
నరులు కన్పడనిచోట సురలు చెన్నారువీట
       అందముగా ఆడుకొందముపదరా
తెలితామరాకు జండా గలపూల రథముమీద
       దేశాలు తిరుగుదాము పదరా

180