పుట:Palle-Padaalu-1928.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పొడుపు కొండలమీద - నిడుపైన చందమామ
       నీలాగె నిలువబడెను గదరా
నేనొంటి గొనుపోతే - నీవునా వెంటవస్తే
       నీడజూచి జడుసుకొంటిని గదరా ౹౹చల్ ౹౹

5



నీవు నేనూనిలబడితే - వచ్చిపోయేటట్టివారు
       చిరునవ్వు నవ్విపోయిరి గదరా
నీకునాకు నేస్త మయితే మల్లెపూల తెప్పగట్టి
       తెప్పమీద తేలిపోదుము గదరా
నాలోని వలపుతీగ నీలాల పేరుగాగ
       నీకంఠమునను జుట్టితి గదరా
నీమీది వలపుతీపి - నామీది కెక్కిపోయే
       నిన్నింక విడువ జాలను గదరా
ఎన్నాళ్ల కైనగాని చిన్ననీ మొగముజూచి
       నిలువెల్ల సొక్కిపోతిని గడరా
నీకునీవారు లేరు - నాకునావారులేరు
       యేటివడ్డున యిల్లుకడదాం పదరా
చల్ మోహనరంగ యేరువస్తే యీదిపోదము పదరా !
చేయి చేతాను వేసి న్యాయమార్గము చూచి
       నాయందు ప్రేమతప్పక మనరా
నీవే చందూరుడైతే నేనే వెన్నెలనౌదు
భావించి వెంటనుందును కదరా ౹౹చల్ ౹౹

179