పుట:Palle-Padaalu-1928.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6 రాయినా శందనాలు

రాయినా శందనాలో ఓయి బావల్లాల బోవన్నిలాల ... బావ
రామలచ్చన్లాటి రాజూలులేరు సీతమ్మలాటి యిల్లాలులేదు
పాడిపంటలు సల్లగుండాల మా కూలిరైతుల కడుపునిండాల
మాకాఁవందులు సల్లగుండాల దండిగ మా సేలుపండాలి ... రామ
ఉత్తారవచ్చే ఎత్తారగంప కారుమేఘా లాకాశంబునిండె
తొలకర్లో వరసాలు కురవాలి ఎకరానికి బత్తాలు పండాలి ... రామ
నీరుపెట్టి దుక్కు దున్నాలి బాబు దుక్కుదున్ని మొక్కనాటాలి బాబు
మా రయితుబాబులు బాగుండాలి ఆరిపిల్లపాప సల్లగుండాలి
ఆరిఆవుల్ని గోవుల్ని మేముకాయాలి కాసినందుకు మాకు నూకలియ్యాలి
పల్లెటూళ్ళు బాగుండాలి పట్నాలు కడుపూలు నిండాలి
సిన్నపెద్దలు కలిసుండాలి ఏఊరుకావూరు ఎంతో బాగుండాల ... రామ
పైరుకంకులపైని పిల్లపిట్టలువాలె ఇల్లాగరానువ్వు పిల్లోడ
కొట్టకుండానువ్వు తిట్టకుండానువ్వు అందర్నిబెదరిస్తె అవతలకుపోవురా ... రామ


పాపము తమవలెనే బ్రతుకుతెరువుకు పొలాలమీద ఆధారపడతాయి. పిల్ల పిట్టలు కొట్టకుండా బెదిరిస్తే అవతలకు - మరోపొలానికి — పోతాయిట. అందమైన సజాతీయభిమానము! కాదంటారా?


8