పుట:Palle-Padaalu-1928.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బంగారిసామి

——ఈపాట ప్రేయసీ ప్రియుల పరిచయారంభమును ధ్వనిస్తున్నది. చంద్రుణ్ణి, గాలినీ, కోయిలనీ తిట్టుకొంటూ పూలపాన్పుమీద బైఠాయించు ప్రబంధ సుందరుల ఉపన్యాసముల ప్రక్కన "కమ్మ గెగ్గిరి వాసనకే ఉండరాదుర ముండ నా మనసు అను ఈ చిన్నదాని కాంక్ష శిలావిగ్రహము ప్రక్కన చిన్నదానివలె కనపడుట లేదా ?

సెక్కు మీదను సన్నగోరూ, సెంపనాజవ్వాదిపూతా
సొంపుగానీ కెవరు బూసీరే, చక్కానిబాలా
ఇంపుగా నీ కెవరు బూసీరే?
ఇత్తరీ జొన్నెన్ను కొలుతూ ఈని నావులపాలుగొలుతూ
రాగిమానూపూలు గొలుతబ్బి, బంగారిసామి
నడిసి రారానాదు సరసాకూ
కుంకమూకురు వేరుచేనూ, దవనమూదానింటితడికే
వంగిరారాసుంకుతగిలేనీ, బంగారిసామీ
తములపాకూ మడుపులం దేనీ
కుట్ర కుట్ర సినుకులోన వుంటిరాదానింటి యెనక
దూడతొత్తు మాటవీ నేరా? బంగారిసామి
దుక్కి పంటా నానిపోయెరా
గారడీ దానింటి వెనుక, మావిడీ కొమ్మాలు రెండు
అందలేదూ పొందలేదూర, బంగారిసామీ
ఆన్నె కారీ కోడి కూసెరా
గాజులుండే సేవిమీదా కమ్మ గెగ్గిరి సెట్టుపుట్టా
కమ్మ గెగ్గిరి వాసనాకేరా బంగారిసామి
ఉండలేదుర ముండ నామనసు

174