పుట:Palle-Padaalu-1928.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లగ్లో పిల్లా

——అనురక్త అయినంత మాత్రాన శకుంతలవలె లోంగిపోనక్కక లేదు. ఈ పిల్ల మాటలూ వర్తనమూ చూడండి.

చిన్నోడు నల్లనల్ల మబ్బుమబ్బు నుండి లగ్గోపిల్లా
           అగో తెల్ల తెల్ల చంద్రుడొచ్చె "
           అల్లి బిల్లి తీగేచూడు "
           అల్లా నేరేడు కిందజూడు "
           మంచి చల్లనైన చెలమ జూడు "
           నేరేడు నీడలోన "
           నీ చారడేసి కళ్ళుజూవు "
           మారేడు నీడలోన "
           నీ బారెడంత జడనుజూపు "
           నిండు పున్నమనాడు "
           పండు వెన్నెలగాచే "
           చిన్నారి చిన్నదాన "
           నాకన్ను పండు సేయరాదె "
           పొన్నపూలు ఏరి తెచ్చి "
           నీ చిన్ని చేతి నియ్యరాదె "
           అందమైన నీదు మోము "
           ఆ చందురుడ్నె ఓడించే "

168