పుట:Palle-Padaalu-1928.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాలయ్య కమ్మోరి బాయి కాడ శంచి
          నువ్వు కడవ నెత్త బెట్టి శంద్రి
          సందు గొందులు దాటి శంద్రి
          నువ్వు సిందులు దొక్కంగ శంద్రి
          నీకొప్పు తిప్పులు సూసి శంద్రి
          నా కోరికలూరేయి శంద్రి
          నీ కాళ్ళు కడియాలోలే శంద్రి
          గణ గణ మోగేయి శంద్రి
          గిలుకు మట్టెలతోనె శంద్రి
          నువ్వు గిర్రున తిరిగేవు శంద్రి

సూపులో సూపెడితె సుక్కలాగున్నావు
లక్కరైకలిస్తా శంద్రి

         నీలంపు బావినీలు శంద్రి
         నే నిక్కంగా తెచ్చిస్తా శంద్రి
         తీగె పట్టెడోలె శంద్రి
         నే తిన్నంగా శెయ్యిత్తా శంద్రి
         నడుము వడ్డాణము. శంద్రి
         నే నాణెంగ శెయ్యిత్తా శంద్రి

నీ సిట్టి ముక్కుసూత్తె సిల్కలా గున్నావు
సీరెలిత్తానోలె శంద్రి

166