పుట:Palle-Padaalu-1928.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంద్రి - బాలయ్య

——పడుచువాడు పలుకుబడి కలవాడై తనకు ఆమ్మా బాబూ లేని పడు చైనట్లయితే చురుక్కన జవాబివ్వ లేదు. వినండి.

బాలయ్య నీ లేడి కన్ను లోలె శంద్రి
         నీ లేతనవ్వులోలే శంద్రి
         ఆతీగె సొగసులోలే శంద్రి
         ఆపళ్ళగుత్తులోలె శంద్రి
         ఆనడక జోరులేమె శంద్రి
         నీ నడుము సన్నమోలె శంద్రి

రంగు పింగులు సూత్తె రంబలాగున్నావు
రంగం వెడదామోలె శంద్రి

శంద్రి నేకై కాల సిన్నదాన్ని బాలయ్య
         నన్ను కంకులు బెట్టకు బాలయ్య
         నాకమ్మ బాబు లేరు బాలయ్య
         నన్ను ఆరళ్ళు బెట్టకు బాలయ్య
         నా మేనత్త సాకుతూంది బాలయ్య
         నాకు మేనరికమున్నది బాలయ్య
ఇరుగు పొరుగు సూత్తే ఏమనుకొంటారో
ఎంటరాకురోరి బాలయ్య

165