పుట:Palle-Padaalu-1928.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భీమరాజుపదము

——వారిలో భీమరాజు ఒకడు, భీమరా జెట్లాంటివాడు ?

వాడమీద వన్నె కాడో భీమరాజు
వాసనకి సంపెంగవనమూ
చేతినిండపుంగరాలో భీమరాజు
చెప్పరాని చక్కదనమూ ౹౹వా౹౹
కాయపంచెలు కట్టుకొని భీమరాజు
కిర్రు చెప్పులు తొడుగుకోని
కర్రచేత బట్టుకోని భీమరాజు
కలక టేరులాగొచ్చేను ౹౹వా౹౹
కాకినాడ రేవులో భీమరాజు
కేవుగట్టి వోడ ఎక్కి
రంగురంగుల బావుటాతో భీమరాజు
రంగుసేసి రంగమెల్లే ౹౹వా౹౹

151