పుట:Palle-Padaalu-1928.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తోడర్ర నీరంత బావుల్లనుంచీ
                గునాసారి గున్నమ్మా
కుప్పా నూర్పులకాడ కూకున్నవేమే
                గునాసారి గున్నమ్మా
పండినాసేలోకి పయినామై ఎల్లీ
                గునాసారి గున్నమ్మా
కొయ్యండి కోతాలు కొడవళ్ళతోటీ
                గునాసారి గున్నమ్మా
కొయ్యించి పొయ్యండి గాదెల్లలోనూ
                గునాసారి గున్నమ్మా
కుప్పించి కొలవండి కుంచాల తోటీ
                గునాసారి గున్నమ్మా
ఎత్తండి బళ్ళాకి ఎగుదిగుడులేకా
                గునాసారి గున్నమ్మా

వీరి కల్పనలు వీరి జీవితాల్లాగుననే సహజ సుందరముగా ఉంటావి. పని ఇచ్చే మహరాజుకి వీరు కల్పించే వాసన బాటలు చూడండి.


5