పుట:Palle-Padaalu-1928.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హైలాస

పడవల రేవు సొగసైన కూడలి. పడవ - ప్రయాణము ఒడిదుడుకులు లేని సాఫీ ప్రయాణము. కళాసీలకూ సరంగుకూ మాత్రము వడవపని చికాకై నదే. సామాన్యముగా ప్రయాణము రాత్రి పూట. పగటి పూటలోనే, వారికి నిద్ర. కనుక వారి జీవితానంద మంతా పడవపైననే సాధించు కుంటారు వారు. వారి పాటలలో కామదేవుడు విచ్చల విడిగా విహరిస్తుంటాడు. నడేటికి పోతే వారిదే రాజ్యము. అలలూగాలీ తోడైతే చెప్పనే అక్కరలేదు.

హైస, హైలాస అన్నవి పడకను బలముగా నీటిలోనికి నెట్టవలసి నప్పుడు వారు పాటలలో ఉపయోగించే ఊతపదాలు, నలుగురూచేరి వీపులు పడవకు దాపు పెట్టి నెట్టితే నాలుగు సెకనులలో వడవనీటిలోకి జరుగుతుంది. నాలుగు సెకనులలోనే పాట పూర్తి కావాలి.

వెళ్ళి కూతురు చూడు హైలాస
బహు పెద్ద మనిషిరా "
చూసి రమ్మంటేను "
చేను కొచ్చిందిరా "
గంగ గౌరమ్మ హైలాస
గంగమ్మ "
దండాలు మాతల్లి "
కొలువులు మాతల్లి "
కొండల్లో మాతల్లి "
దిగిరావే మాతల్లి "

147