పుట:Palle-Padaalu-1928.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పొట్టేలు

పొగరెక్కి పొట్టేలు పొడిచేయునోపిల్ల
తొగరుచీరపిల్ల తోవలో లెగులెగు
పచ్చగట్టుమేసి వక్రించినదికొమ్ము
మచ్చికదనుకోకు మార్గాన లెగులెగు
బొచ్చుమెడ చిరుగంట బురణించి రవణించు
ముందంజవేయకు పుంతలో లెగులెగు
కచ్చపోసినపిల్ల కాలందెఘలపిల్ల
వచ్చుచున్నపిల్ల వయ్యారిపిల్ల