పుట:Palle-Padaalu-1928.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4 గునాసారి గున్నమ్మ

—అయితే కూడుకి తక్కువైతే గుణానికి తక్కువా? వినండి వారి దినచర్య! ఉదయాన్న లేచినది మొదలు సూర్యుడు కుంకే వఱకు పొలమూ, గోప్పూ, నీరూ, కోత, కొలత. వీరేకాదా దేశానికి ధనము!

వొడినిండ పసుపేస్కో వొయ్యారమేమే
                     గునాసారి గున్నమ్మా
పొద్దున్న నువులెగసి పొలానికెళ్ళే
                     గునాసారి గున్నమ్మా
ఎండెక్కి సూరీడు కొండెక్కిసూసే
                    గునాసారి గున్నమ్మా
గంపకిందాకోడి కంయ్యిమనకూసే
                    గునాసారి గున్నమ్మా
గొప్పుతవ్వేకాడ కొప్పెందుకోలే
                    గునాసారి గున్నమ్మా
గట్టెక్కి సూత్తాడో గవరయ్యకాపూ
                    గునాసారి గున్నమ్మా
మద్దేన్నం యేలపుడు మరిదప్పికేత్తే
                    గునాసారి గున్నమ్మా
సల్దీగెంజీ కాంతతాగీ మరివుండు
                    గునాసారి గున్నమ్మా
ఆకుమళ్ళాలోను ఆకెండిపోయే
                    గునాసారి గున్నమ్మా