పుట:Palle-Padaalu-1928.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తాతతో పరిహాసకం

——ఆదుగో తార మీద పాడుతున్నాడు గారడీవాడు. ఆపాగా, మీసము, ఎర్ర చోక్కా, బంగారు బిళ్ళల దండా క్రీడాభిరామ కాలానికీ నేటికీ ఆదేవేష మితనికి,

తాతో పీతో ముంజి కాయమూతో
ఉల్లికోడు ఊతో తాతోయి తాత
తాతోయ్ ! మాయింటికి రారో ! మాటుంది;
నూవు కూసుండె; కురిసీల పీటుంది;
నూవు నుంచుంటె; నిమ్మ చెట్టు నీడుంది;
నూవు తొంగుంటె; పట్టెమంచం పరుపుంది;
నీ కాకలయితే; సన్నబియ్యం కూడుంది;
అందులో కొంకాయి; కూరుంది;
నువ్వు సస్తేను; వల్ల కాటి దిబ్బుఁది.