పుట:Palle-Padaalu-1928.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యాత్మము

——వీరెవరో తాత గారు బియ్యపు మూట నెత్తిమీద ఉన్నప్పటికీ ముష్టి మానలేదు. ఏమంటారు ? జోగయ్యతాత గారా? ఆబియ్యము కొవ్వూరు సత్రాని కివ్వదానికా? ధన్యుడు, దండము తాతగారూ.

ధీరుడు విశ్వామిత్రుడు తానయోధ్యకు
శ్రీరామునీ జూడవచ్చెను - అని
వారుడై సౌధము జొచ్చెను - ఎదురూ
గారాజు చనితోడి తెచ్చెను - మునికి
చారు సింహాసనమిచ్చెను - మహూ
దారుడై పూజ యొనర్చెను - స్వామి
మీరు వచ్చినయట్టి కారణమది దెల్పు
డీ రాజ్యమైన మీకిచ్చెదననె
ను రాకేందువదన వినవే యీచరితము కుందరదనా !!

మనసా వాచాకర్మణా మూడుయోగాలూ" సాధన చేస్తున్నాడీ బడుగు బ్రాహ్మణుడు !