పుట:Palle-Padaalu-1928.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బసవన్న

——అడుగో బసవన్న. బసవన్న ఆనంగనే వీర శైవము గుర్తుకు వస్తుంది. నంది శివుని వాహనము. బసవన్న సింహద్రి అప్పన్న, ఏడుకొండల వెంకన్న, అంశములు పుణికి పుచ్చు కున్నాడు. అప్పన్న అన్న మాట 'అహోబలకు భ్రంశరూపమై యుండునా ?

డూ డూ డూ బసవన్నా
డూ డూ డూ యెంకన్నా
పెబువుగారికి దండం పెట్టు
బాబుగారికి భాగ్యం కలిగి
పిల్లపాపలు చల్లగవుండి
పెరుపంటలు గాదులు నిండి
పచ్చగాను పది కాలాలుండి
దానం ధర్మం చేత్తావుండి
యెండిగిట్టలు యిస్తారంట
ఫైండి కొమ్ములు కడతారంట
పట్టుశాలువ పైనయేసుకు
పదిమందిలో పేరు సెప్పుకు
యింటికొక్కడు యీరభద్రుడు
పంచకొక్కడు బసవేస్సురుడు
చల్లగ వెలసి పెబువులు వుంటె
కళ్ళు వేడుకలు మనకంతాను

గంగెదు రాసు సన్నాయి, శ్రుతి బూరా, బిళ్ళగంతటా ఆతనికి కాపీరైటుగా దఖలు పడ్డవి.