పుట:Palle-Padaalu-1928.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గొల్ల వారము

గోల్ల వారము సద్గురునిసేవ కలవారము
చీకటికోనలోన చిట్టడవి మేసేపశువుల
చెదరకుండా మందతోలే॥
వరయోగ తిరుమంత్రమును వదలక సేవించేవారికి
  ... ... ... ... చల్లలమ్మే ౹౹గొల్ల౹౹
గోప్యమైనా తిరుమంత్రమను గొడ్డలొకటి చేతబూని
అండగోరండమైన అడవి నరకి దొడ్డికట్టే ౹౹గొల్ల౹౹
అందమైన బిందెలోన, చెదరకుండా పాలుపితికి
పొంకమైనా అడుపుమీదా పొంగకుండా పాలుకాచే ౹౹గొల్ల౹౹
శాంతమను పాలారబోసి, చతురాక్షరమున తోడూయుంచి
ఆత్మయనియెడుభాండములోనా, ఆందముగాతైరుదరచే ౹౹గొల్ల౹౹
తిరుమంత్రమను కవ్వముబట్టి, ద్వైమంత్రమనే తైరుతరచి
శరణార్ధియను వెన్నదీసి చెదరకుండా ముద్ద చేసే ౹౹గొల్ల౹౹
అన్ని విధముల అమరగాచి, వన్నె మీరా నెయ్యి దీసి
వినయమైన విన్నపముతో నిష్టతొ నిజగురునిచేరే ౹౹గొల్ల౹౹

హఠయోగుల గుప్తతత్త్వాలు గుర్తుకు వస్తున్నది. వడగళ్ వైష్ణవము భక్తునికి అధికార అర్హతను నిర్ణయిస్తూ సాధనపట్ల కొంత గోప్యతను కోరుకుంది కాబోలు. అందుకే నేమో ఈ పాట ఇళ్లలోనేగాని వీధిలో వినబడకపోవడము.

127