పుట:Palle-Padaalu-1928.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పైస తమాషా

—— ఏదోటక్కుటక్కుమని వాద్యం వినబడు తున్నది. నల్లకోటూ, ఎర్రతలపాగా, అద్దాలు మెరుస్తూ తాలూకా కచేరీ ఆకారంలో కొయ్య పెట్టే జోరుగా వున్నది వీని వ్యాపారము ! చెంపలకు చేతులు చేర్చుకుని, వంగి, పెట్టెలోని బొమ్మలను ఆప్యాయముతో చూస్తున్నారు పిల్లలు వీరికన్నా చుట్టూ నున్నవారి కోలాహలం జాస్తిగా ఉన్నది. వాద్యమను కున్నాము. గోళ్ళతో కొట్టుకూ చేతిచిరుకట్టెతో లయనిలుపుతూ పాడుతున్నాడు.

పైన తమాషా చూడు బాబూ.
ఏమి లాహిగా నున్నది చూడు
ఏమి తమాషా లున్నయి చూడు
కాశీపట్నం చూడర బాబూ
కలకలలాడే గంగానదిని
కన్నుల కఱవుగ చూడరబాబు
హరిశ్చంద్రుడు సత్యం కోసం
ఆలి బిడ్డలను అమ్మిన చోటు
అదు గదు గదుగో విశ్వేశ్వరుడు
హర హర హర యను భక్తుల చూడు
చూచి మోక్షం పొందర బాబు ౹౹పైస౹౹
హస్తినాపురీ పట్నం చూడు
పాండవు లేలిన పట్నం చూడు
తాజమహలును చూడర బాబు
కృష్ణ దేవరాయలని చూడు
బెజవాడలో కనకదుర్గను
భద్రాచలములో రామదాసును
కన్నుల పండువుగ చూడర బాబూ
చూచి జ్ఞానం పొందర బాబూ

122