పుట:Palle-Padaalu-1928.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాశీ కావడి

——గంటల కావడితో కాశీపటాలు చూపించటానికి యాత్రికుడు వస్తున్నాడు. కావడి దింపటమూ తట్టల చీరలు ముళ్ళు విప్పటమూ, చూడవచ్చిన వారిని సర్ది కూర్చోన బెట్టటమూ ఒక్కొక్క పటమూ విప్పి ప్రదర్శించడమూ,—— మొత్తమొక అరగంట ప్రదర్శనము !

కాశీకి పోయాను రామహరీ
కాశి తీర్ధమూ తెచ్చాను రామహరీ
       కాశీకి పోలేదు రామహరీ
       వూరి కాలవలో నీళ్ళండి రామహరీ
కాశీకి పోయాను రామహరీ
కాశి విభూతి తెచ్చాను రామహరీ
       కాశీకి పోలేదు రామహరీ
       వీడి కాష్టంలొ బూడిదండి రామహరీ
పంచేంద్రియములూ రామహరీ
నేను బంధించి యున్నాను రామహరీ
       కొంచెమునమ్మినా రామహరీ
       కొంప ముంచి వేస్తాడండి రామహరీ
ఆలు బిడ్డలు లేరు రామహరీ నేను
ఆత్మయోగి నండి రామహరీ
       ఆలు బిడ్డలెల్ల రామహరీ వీని
       కాయూర సున్నారు రామహారీ

వెనుక మాటలు చెప్పేవాడు వాని బంధువే.

121